VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన అదనపు కలెక్టర్
WGL:రాయపర్తి మండలం తిరుమలాయపల్లి గ్రామంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి శనివారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో, పారదర్శకంగా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని సూచించారు.