విద్యుత్తు సరఫరా నిలిపివేత

విద్యుత్తు సరఫరా నిలిపివేత

ASR: ఎటపాక మండలం బుట్టాయి గూడెం సబేస్టేషన్‌లోని ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో తోటపల్లి 11 కేవీ ఫీడర్ పరిధిలోని వ్యవసాయ రైతులకు రెండు రోజుల పాటు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ నెల 16, 17 తేదీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్తు నిలిపివేస్తామని ఈఈ వెంకటరమణ తెలిపారు. రైతులు సహకరించాలని కోరారు.