వ్యక్తి మృతి.. మాజీ ఎమ్మెల్యే నివాళి

MBNR: భూత్పూర్ మండలం అన్నసాగర్‌కు చెందిన వంకరమౌని రాజు ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బుధవారం గ్రామంలోని ఆయన నివాసానికి చేరుకొని రాజు భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబానికి అండగా ఉంటూ అన్ని విధాలుగా ఆదుకుంటామని మాజీ ఎమ్మెల్యే మృతుని కుటుంబసభ్యులకు భరోసా కల్పించారు.