రహదారులు, డ్రైనేజీపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: కమిషనర్

రహదారులు, డ్రైనేజీపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: కమిషనర్

తూ.గో: రాజమహేంద్రవరం నగరంలోని పలు ప్రాంతాలను నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా బుధవారం ఉదయం పరిశీలించారు. శానిటరీ సిబ్బందితో కలిసి అధికారులకు అవసరమైన సూచనలు అందించారు. ప్రజల సౌకర్యార్థం రహదారులు, డ్రైన్లు, శుభ్రత పనులపై ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వర కమిషనర్ వెంట ఉన్నారు.