రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

MNCL: భీమిని మండలంలోని రాంపూర్ గ్రామ రైతు వేదిక సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. బొలెరో, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఈ ఘటనలో తాండూరు మండలంలోని గోపాల్ నగర్‌కు చెందిన గజ్జల నారాయణ, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం ఈస్గామ్‌కు చెందిన కృష్ణసాగర్ గాయపడ్డారు. క్షతగాత్రులను బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించారు.