కొత్తగూడెంలో ఆటో డ్రైవర్ శ్రీను మృతి
BDK: కొత్తగూడెం రామాంజనేయ కాలనీకి చెందిన సీనియర్ ఆటో డ్రైవర్ శ్రీను అనారోగ్యంతో ఇవాళ మృతిచెందారు. ఆయన మృతి స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాద సందర్భంలో ఆటో యూనియన్ మిత్రులు, ఆటో ఓనర్స్, బంధువులు, స్నేహితులు, అలాగే పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు శ్రీను భౌతిక దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.