బాసర అమ్మవారి ఆలయంలో మజ్జిగ పంపిణీ

NRML: బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ ఈవో విజయ రామారావు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. వేసవికాలం దృష్టిలో ఉంచుకొని ఆలయ ప్రాంగణం వద్ద చలువ పందిళ్ళు వేశారు. భక్తులకు ఆలయం తరఫున క్యూలైన్లలో మజ్జిగను పంపిణీ చేశారు. ప్రతి శుక్రవారం, ఆదివారాల్లో వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా మజ్జిగను అందిస్తున్నట్లు తెలిపారు.