'రైతాంగ సమస్యలను పరిష్కరించండి'
ELR: రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర పిలుపులో భాగంగా చింతలపూడి తాహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం అందచేశారు. ధరలు పడిపోయి నష్ట పోతున్న అరటి, నిమ్మ, బత్తాయి రైతులను ఆదుకోవాలనీ సీపీఐ మండల కార్యదర్శి బాబు డిమాండ్ చేశారు. ఆధిక వర్షాలు,వరదలు మరియు కరువు వలన పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను,కౌలురైతులను ఆదుకోవాలన్నారు.