ప్రత్యేక అలంకరణలో వరాల ఆంజనేయస్వామి

అన్నమయ్య: మదనపల్లె లోని శ్రీ వరాల ఆంజనేయస్వామి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి శనివారం ఉదయాన్నే అభిషేకాలు నిర్వహించి పుష్పాలు, తమలపాకులతో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ,ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి మొక్కలు తీర్చుకున్నారు.