'చలి తీవ్రతతో పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి'
CTR: ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డాక్టర్ మధుసూదనాచారి సూచించారు. సోమవారం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన మాట్లాడుతూ.. రోజురోజుకూ చలి తీవ్రతతో పాటు మంచు కురవడం ఎక్కువ అవుతుందన్నారు. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.