కోతులతో రైతుల ఆందోళన

కోతులతో రైతుల ఆందోళన

BPT: తిమ్మాయపాలెం గ్రామంలో కోతుల బెడద ఎక్కువైందని శనివారం రైతులు వాపోతున్నారు. మొక్కజొన్న పంటపై అవి దాడులు చేసి పంటను నాశనం చేస్తున్నాయంటున్నారు. సుమారు 300 కోతులు సమూహంగా ఏర్పడి మొక్కజొన్న కండెలను కొరికి తినేస్తున్నాయన్నారు. రూ.వేలల్లో పంట నష్టం వాటిల్లిందిని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వాటిని ఇతర ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు.