VIDEO: 'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

SRD: భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జోగిపేట ఎస్సై పాండు సూచించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు, పొంగిపొర్లుతున్నాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. రోడ్ల మీదుగా వెళ్తున్న నీటిని దాటుకొని వెళ్లే ప్రయత్నం చేయవద్దని ప్రజలకు సూచించారు.