సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎస్సై సాంబమూర్తి

సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎస్సై సాంబమూర్తి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీలో కాలనీ వాసులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను బుధవారం ఎస్సై సాంబమూర్తి ప్రారంభించారు. ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, ఇటీవల జరిగిన దొంగతనాల కేసుల పరిష్కారంలో సీసీ కెమెరాలు కీలకంగా ఉపయోగపడినట్లు ఎస్సై తెలిపారు. ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.