VIDEO: ప్రధాన రహదారుల విస్తరణ పనులు ప్రారంభం
MNCL: బెల్లంపల్లి పట్టణ అభివృద్ధిలో భాగంగా ప్రధాన రహదారుల విస్తరణ పనులు శుక్రవారం మొదలుపెట్టారు. రహదారుల విస్తరణలో అడ్డుగా ఉన్న కట్టడాలను మున్సిపల్ అధికారులు జేసీబీతో తొలగించారు. అయితే ఎంత మేరకు రోడ్డు విస్తరణ చేపట్టనున్న విషయాలను అధికారులు స్పష్టం చేయకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పష్టత ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.