జిల్లాలో 103 కుళాయి కనెక్షన్లు తొలగింపు
GNTR: నగరపాలక సంస్థ చెల్లింపుల్లో 103 అసెస్మెంట్ల కుళాయి కనెక్షన్లను రెవెన్యూ అధికారులు ఆదివారం తొలగించారు. రెండు రోజుల్లో మొత్తం రూ.1.09 కోట్లు వసూలైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ.. 50 శాతం వడ్డీ రాయితీతో పన్ను చెల్లించేందుకు మరో 9 రోజులే గడువు ఉందని, పెద్ద మొత్తంలో బకాయి ఉన్నవారికి రెడ్ నోటీసులు జారీ చేసి ఆస్తుల జప్తు చేయనున్నామన్నారు.