VIDEO: మొబైల్ షాప్‌లో చోరీ.. నాలుగు ఫోన్లు అపహరణ
MHBD: పట్టణంలోని నెహ్రూ సెంటర్‌లో గల ప్రేమ్ మొబైల్ షాపులో నలుగురు మైనర్ యువకులు కస్టమర్లుగా నటిస్తూ చోరీకి పాల్పడ్డారు. ఫోన్ రిపేర్ పేరుతో యజమానిని మాటల్లో పెట్టి దృష్టి మళ్లించి, షాపులో ఉన్న నాలుగు ఖరీదైన మొబైల్ ఫోన్లను అపహరించారు. సీసీటీవీ పుటేజ్ ఆధారంగా బాధితుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు