డ్రోన్ తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలు

GDWL: మానవపాడు మండలం కోర్విపాడు సమీపంలో పొలంలో బుధవారం క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్న డ్రోన్ ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ల్యాండింగ్ సమయంలో ఈ ప్రమాదం జరగడంతో కూలి పనికి వచ్చిన బొంకూరుకు చెందిన నాగన్నకు తీవ్ర గాయాలు అయ్యాయి. అదే సమయంలో పక్కనే ఉన్న బాబుకు స్వల్ప గాయాలయ్యాయి.వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు.