గుర్తుతెలియని మహిళ మృతి

గుర్తుతెలియని మహిళ మృతి

JGL: కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఇంటి ముందర గుర్తు తెలియని మహిళ పడిపోయి ఉండగా స్థానికుల సాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బుధవారం మృతి చెందిందని ఎస్సై చిరంజీవి తెలిపారు. మృతురాలి వయసు సుమారు 55 నుంచి 60 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. మృతురాలికి సంబంధించి ఎవరికైనా ఆచూకీ తెలిస్తే 8712656790 నంబరుకు తెలియజేయాన్నారు.