ప్రభుత్వం వెంటనే పంట నష్టం అందజేయాలి: మాజీ MLA

ప్రభుత్వం వెంటనే పంట నష్టం అందజేయాలి: మాజీ MLA

KMR: గత కొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షాలకు జుక్కల్ నియోజకవర్గ వ్యాప్తంగా దెబ్బతిన్న పంటలకు వెంటనే పంట నష్టం అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట నష్టం అందించాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే డిమాండ్ చేశారు. గురువారం డోంగ్లి మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.