తమకు రక్షణ కల్పించాలి: ప్రేమజంట

NLR: కందుకూరు చెందిన అఖిల్, దివ్య ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు. తమకు పెద్దల నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించారు. నెల్లూరు ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. తల్లిదండ్రులకు పోలీసులు రెండుసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా ఇంకా తమను బెదిరిస్తున్నారని వాపోయారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలన్నారు.