సువర్ణవేణికి గద్దర్ జాతీయ సేవాపురస్కారం

తూ.గో: కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఇంగ్లీష్ ఉపాధ్యాయుని బూసి సువర్ణవేణికి గద్దర్ జాతీయ సేవా పురస్కారం లభించింది. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మమత స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో పి.గన్నవరం సాయి తేజ జూనియర్ కళాశాలలో గురువారం పురస్కారాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారధి ఛైర్మన్ డాక్టర్ వెన్నెల గద్దర్ పురస్కారాన్ని అందించారు.