బుచ్చిలో పింఛన్లు పంపిణీ
NLR: బుచ్చిరెడ్డిపాళెం మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. పట్టణంలోని ఖాజా నగర్‌లో ఛైర్‌పర్సన్ మోర్ల సుప్రజ మురళి, పట్టణ అధ్యక్షుడు గుత్తా శీనయ్య పింఛన్లను పంపిణీ చేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. కోవూరు నియోజవర్గాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు.