విద్యార్థినికి ఇచ్చిన హామీ నెరవేర్చిన కలెక్టర్
యాదాద్రి: పాఠశాలకు సరిగా రాని సింగన్నగూడెం, ఇందిరమ్మ కాలనీకి చెందిన విద్యార్థిని సుస్మిత ఇంటికి నిన్న వెళ్లిన కలెక్టర్ హనుమంతరావు, ఆమెకు ఇచ్చిన హామీని నెరవేర్చారు. తహశీల్దార్ అంజిరెడ్డి.. సుస్మిత చదువుకు కావాల్సిన స్టడీ మెటీరియల్, చైర్, ప్యాడ్, బుక్స్, పెన్నులను అందించారు. కార్యక్రమంలో ఆ సైదాబ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.