బాధ చెప్పుకోవాలా? అయితే రూ.250 కొట్టండి..!!
ముంబై బీచ్‌లో ఓ వ్యక్తి 'లిజనింగ్ సర్వీస్' పేరుతో వింత వ్యాపారం మొదలుపెట్టాడు. 'మీ బాధలు చెప్పండి.. నేను వింటాను' అంటూ ఒక బోర్డు పట్టుకుని కూర్చున్నాడు. చిన్న సమస్యలు వినడానికి రూ. 250, అదే మీరు ఏడుస్తుంటే మీతో కలిసి ఏడవడానికి రూ.1000 వసూలు చేస్తారట. ఒంటరితనంతో బాధపడేవారికి ఇదొక ఊరటనిచ్చే ప్రయత్నమని వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.