విద్యా సంస్థల్లో 'నషా ముక్తా భారత్' కార్యక్రమం

విద్యా సంస్థల్లో 'నషా ముక్తా భారత్' కార్యక్రమం

ASR: జిల్లా ఎస్పీ ఆదేశాలతో అరకులోయలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో "నషా ముక్త భారత్ అభియాన్" కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ మేరకు అరకు ఎస్సై గోపాలరావు మాట్లాడుతూ.. గంజా, సారా, గుట్కా వంటి మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులతో మాదకద్రవ్య రహిత సమాజం కొరకు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్, టీచర్లు పాల్గొన్నారు.