విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తాం: MEO

HYD: బోయిన్ పల్లిలోని మేధా పాఠశాలలో డ్రగ్స్ పట్టుబడటంతో అధికారులు ఆ పాఠశాలను సీజ్ చేశారు. ఈ విషయంపై తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని MEO హరిచందన్ స్పష్టం చేశారు. పాఠశాలలో చదువుతున్న 63 మంది విద్యార్థులను సమీపంలోని ఇతర ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామని విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.