మంజూరైన వితంతు పెన్షన్ల పంపిణీ

SKLM: భర్తను కోల్పోయిన వితంతువులకు, వృద్ధులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర కళింగ అసోసియేషన్ సభ్యులు తమ్మినేని చంద్రశేఖర రావు తెలిపారు. ఆమదాలవలస పట్టణంలో గల టీడీపీ కార్యాలయంలో శనివారం ప్రభుత్వం ద్వారా మంజూరైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అర్హులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మండల టీడీపీ అధ్యక్షులు నూక రాజు అన్నారు.