'బాల్య వివాహాలను నిర్మూలిద్దాం'

'బాల్య వివాహాలను నిర్మూలిద్దాం'

SDPT: బాల్య వివాహాలను అరికట్టి, పిల్లల బంగారు భవిష్యత్తును కాపాడుదామని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు సాయిని విజయభారతి పిలుపునిచ్చారు. సిద్దిపేటలో దీనికి సంబంధించిన గోడపత్రికను ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని కోరారు.