అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని గుండాపురం గ్రామానికికి చెందిన పాణ్యం శ్రీహరి (35) జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. అప్పులు ఎక్కువగా ఉండడంతో హైదరాబాద్‌లో తాపీ మేస్త్రీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అప్పులు తీరక పోగ వడ్డీలు పెరగడంతో ఏమీ చేయలేక రైలు కింద పడి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.