ఉప్పల్ శివారు కాలనీవాసులు ఆందోళన
MDCL: ఉప్పల్ శివారు కాలనీవాసులు ఆదివారం ఆందోళన చేపట్టారు. ఉప్పల్, కురుమ నగర్, లక్ష్మీనరసింహకాలనీల సమీపంలో STP నిర్మించవద్దని శివారు కాలనీవాసులు ఆందోళనకు దిగారు. ఆందోళనకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ.. కాలనీవాసుల ప్రయోజనం దృష్ట్యా మూసీ సమీపంలో STP నిర్మించాలని కోరుతున్నామన్నారు.