సింగూరు నీరు విడుదల చేయాలని కలెక్టర్‌కు వినతి
MDK: యాసంగి పంటల కోసం సింగూరు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ ప్రతిమా సింగ్‌కు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ఇవాళ వినతి పత్రం సమర్పించారు. క్రాప్ హాలిడే డిక్లేర్ చేయనందున కొందరు రైతులు పంటలు వేశారన్నారు. అవి పొట్ట దశలో ఉన్నందున సింగూర్ నీటిని వెంటనే విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.