పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
PPM: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భామిని మండలం పర్యటన నేపద్యంలో జిల్లా కలెక్టర్ డా.ప్రభాకర రెడ్డి బుధవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ పరిశీలించారు. అనంతరం ఏర్పాట్లు పక్కగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ, జేసీ, సబ్ కలెక్టర్, పాలకొండ సబ్ కలెక్టర్ పాల్గొన్నారు.