'సాంప్రదాయ పద్ధతులే రైతుకు లాభదాయక మార్గం'
SKLM: ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకుండా సాంప్రదాయ పద్ధతిలో పండించిన కూరగాయలు ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుందని మందస వెలుగు పీఓ పైడి కూర్మా రావు తెలిపారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను పరిశీలించారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ రోజుల్లో సహజ పద్ధతులు రైతులకు లాభదాయక మార్గంగా మారుతున్నాయని పేర్కొన్నారు.