వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు : తహసీల్దార్

BHNG: వర్షాల దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆలేరు తహసీల్దార్ ఆంజనేయులు అధికారులకు సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆలేరు మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా శుక్రవారం మండల స్థాయి అధికారులతో తహసీల్దార్ కార్యాలయంలో ఆయన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.