తాళం వేసిన ఇంట్లో దొంగ చేతివాటం

NZB: నిజామాబాద్ బాబన్ సా పహాడ్లోని వెంగళరావు కాలనీలో శుక్రవారం తాళం వేసిన ఇంట్లో దొంగ చేతివాటన్ని ప్రదర్శించాడు. స్థానికంగా ఉండే రిజ్వాన్ ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దొంగ ఇంటి తాళాలు పగలగొట్టి 5 గ్రాముల బంగారం, రూ.20 వేల నగదు, 20 తులాల వెండిని అపహరించాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు అరో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.