రహదారి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే
NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గ్రామస్తుల రహదారి సమస్యకు పరిష్కారం చూపారు. కొడవలూరు మండలం దాసరిపాలెం నుంచి యల్లాయపాలెం వెళ్లే రహదారి గుంతలు పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రశాంతమ్మ.. తక్షణమే అధికారులను ఆదేశించి రహదారిపై ఉన్న గుంతలను పూడ్చి లెవలింగ్ చేయించి సమస్యను పరిష్కరించారు.