రాత్రి సమయంలో ఇల్లు కూల్చివేతకు ఇరిగేషన్ అధికారులు

రాత్రి సమయంలో ఇల్లు కూల్చివేతకు ఇరిగేషన్ అధికారులు

కోనసీమ: అమలాపురం నియోజకవర్గం, ఉప్పలగుప్తం మండలం, S. యానం వద్ద పంట కాలువపై ఏళ్ల సంవత్సరాలుగా నివసిస్తున్న కుటుంబాలను రాత్రి సమయంలో జిల్లా ఇరిగేషన్ అధికారులు బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం ఒక్క రోజు కూడా సమయం ఇవ్వకుండా, దౌర్జన్యంగా సామాన్లను రోడ్డుపైకి పడేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.