సింహాద్రి అప్పన్న ఆలయంలో గరుడ సేవ

సింహాద్రి అప్పన్న ఆలయంలో గరుడ సేవ

VSP: సింహాచలం వరాహాలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శుక్రవారం గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపజేశారు. సేవలో పాల్గొన్న భక్తుల, గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో కమనీయంగా జరిపించారు. అనంతరం మంత్రపుష్పం, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.