మహిళా అదృశ్యం.. కేసు నమోదు
KNR: ఓ మహిళ అదృశ్యమైన ఘటన జమ్మికుంట పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కాల్వ సుమలత ఆరేళ్ల కిందట భర్త శ్రీధర్ మృతి చెందగా.. కొడుకుతో కలిసి ఉంటుంది. 6 నెలలుగా కుటుంబ సమస్యలతో సుమలత ఇబ్బంది పడుతుంది. గురువారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులకు చెప్పకుండా వెళ్లి పోయిందని కుమారుడి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామన్నారు.