యాదాద్రి క్షేత్రాన్ని దర్శించుకున్న సీఎస్ శాంత కుమారి

NLG: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి దర్శించుకున్నారు. గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన సీఎస్ కు ఆలయ ఈవో భాస్కర్ రావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.