'మిస్సైల్ ఉమెన్' టెస్సీ థామస్‌కు గౌరవ డాక్టరేట్
ATP: అనంతపురం JNTU 15వ స్నాతకోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రముఖ శాస్త్రవేత్త, 'మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా' టెస్సీ థామస్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. సామాజిక అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు సాగాలని గవర్నర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 74 మందికి పీహెచ్‌డీలు, 31 మందికి బంగారు పతకాలు అందజేశారు.