తేలప్రోలుకు మాజీ ఉపరాష్ట్రపతి రాక

కృష్ణా: జిల్లాలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గురువారం పర్యటించనున్నారు. ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించే గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు కళాశాల నిర్వాహకులు తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు.