బీజేపీ మండల అధ్యక్షురాలు అరెస్ట్

MDK: బీహార్ ఎన్నికల యాత్రలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మెదక్ జిల్లా కేంద్రంలో నిరసన చేసేందుకు వెళ్తున్న బీజేపీ మండల అధ్యక్షురాలు బెండ వీణను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి అక్రమ అరెస్టులకు బీజేపీ నాయకులు భయపడరని అన్నారు.