ఉల్లి రైతులను ఆదుకోండి: సీపీఎం

KRNL: కర్నూలు జిల్లాలో ఉల్లి ధరలు పడిపోవడంతో రైతులు నష్టపోతున్నారని సీపీఎం నాయకుడు రాధాకృష్ణ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఉల్లిగడ్డలకు క్వింటానికి రూ.2,000 మద్దతు ధర ప్రకటించాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.1,200 మద్దతు ధర రైతులకు అందడం లేదని, దళారుల కారణంగా మరింత తక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తోందని తెలిపారు.