‘రీ వెరిఫికేషన్ ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి'

MNCL: ఇటీవల వెలువడిన పదో తరగతి పరీక్షాపత్రాల రీ వెరిఫికేషన్ కోసం విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చొప్పున ఫీజును ఆన్లైన్లో పాఠశాల లాగిన్ ద్వారా మాత్రమే చెల్లించాలని మంచిర్యాల డీఈఓ యాదయ్య తెలిపారు. రీ వెరిఫికేషన్ చెల్లించేందుకు bse.telangana వెబ్సైట్ ను సంప్రదించాలన్నారు. ఆన్లైన్ చేసిన దరఖాస్తు పత్రాలను డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.