నాటుసారా స్వాధీనం.. 960 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

నాటుసారా స్వాధీనం.. 960 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

KRNL: కోడుమూరు ఎక్సైజ్, కర్నూలు ఈఎసీటీఎఫ్ పోలీసులు శనివారం సంయుక్తంగా ఎల్బండ తండా పరిసరాల్లో దాడులు నిర్వహించారు. 960 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, 21 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు సీఐలు మంజుల, కృష్ణ తెలిపారు. తండాకు చెందిన ముగ్గురు అనుమానితులపై కేసు నమోదు చేశారు. ఎస్సైలు చంద్రమోహన్, ఇంద్రకరణ్ తేజ ఇతర సిబ్బందితో దాడిలో పాల్గొన్నారు.