సైన్స్ ఇన్నోవేషన్ మేళాలో ప్రతిభ చాటిన విద్యార్థి
Srcl: రుద్రంగి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థి వై. హరిహరన్ (9వ తరగతి) రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఇన్నోవేషన్ మేళా ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాలోనే ద్వితీయ స్థానం సాధించాడు. దీంతో కరస్పాండెంట్ ఎలిగేటి నరేష్, ప్రిన్సిపాల్ హరినాథ్ రాజు, డైరెక్టర్లు తీపి రెడ్డి వెంకటరెడ్డి, ఎర్రం గంగా ఉపాధ్యాయులు అతడని అభినందించారు.