'మున్సిపల్ పీఠాన్ని లేడీస్ కోటా కింద కేటాయించాలి'

RR: షాద్‌నగర్ మున్సిపల్ పీఠాన్ని బీసీలకు ఇవ్వాలని జాతీయ బీసీ సేన చౌదరిగూడ మండల మహిళా అధ్యక్షురాలు జయ శ్రీకాంత్ అన్నారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. మున్సిపల్ పీఠాన్ని బీసీలకు అప్పజెప్పాలని, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ సముచిత న్యాయం చేయాలన్నారు. మహిళలకు రాజకీయపరంగా పెద్దపీట వేసే విధంగా మున్సిపల్ పీఠాన్ని లేడీస్ కోటా కింద కేటాయించాల్సిందిగా కోరారు.