జియాగూడ ‘కేసరి హనుమాన్' చరిత్ర

జియాగూడ ‘కేసరి హనుమాన్' చరిత్ర

HYD: మూసీ నది తీరాన ఉన్న జియాగూడ కేసరి హనుమాన్ ఆలయం మూడు శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యం. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువులైన సమర్థ రామదాస స్వామి స్వయంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్టించడం ఈ క్షేత్రం విశిష్టత. నిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడే ఈ ఆలయం, హనుమాన్ జయంతి వేడుకలకు అత్యంత ప్రసిద్ధి.