డోంగ్లిలో 240 పశువులకు టీకాలు
KMR: పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నేడు డోంగ్లిలోని మొఘా గ్రామంలో పశువులకు గాలికుంట వ్యాధినిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించారు. మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పరమేష్ పటేల్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ టీకాల కార్యక్రమాన్ని పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 240 పశువులకు టీకాలు వేసినట్లు మండల పశువైద్యాధికారి వినీత్ కుమార్ తెలిపారు.